తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన్ని గన్ పార్క్ ముందు నిలబెట్టి కాల్చి చంపినా తప్పులేదంటూ రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అక్రమాలు లేవని టీఆర్ఎస్ బుకాయిస్తోందని విమర్శించారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి తెర వెనుక ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఛత్తీస్ గఢ్ తో దీర్ఘకాల ఒప్పందంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఈఆర్సీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ విద్యుత్తు కొనుగోళ్లను తప్పుబట్టారని గుర్తుచేశారు.
జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్