telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజా ప్రతినిధులకు పక్క రాష్ట్రాల్లో వైద్యం: దేవినేని

devineni on power supply

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి ఓ న్యూస్ ఛానెల్‌లో వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఊహించని విధంగా పెరుగుతున్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించడం లేదన్నారు.బుధవారం 9782 కేసులు, 86 మరణాలు సంభవించాయని తెలిపారు.

కొంతమంది ప్రజా ప్రతినిధులు మాత్రం పక్క రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం పొందుతున్నారన్నారు. సామాన్య ప్రజలకు కూడా ఆ స్థాయిలో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. 3,16,000 కేసులు, 3,000 మరణాలతో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా నిన్న కేబినెట్‌లో ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు.

Related posts