telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

టిక్‌టాక్‌‌లో అసభ్య చిత్రాలు పోస్ట్ చేసిన భార్య.. తట్టుకోలేక హత్య చేసిన భర్త

Crime

చైనాకు చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌ లో అన్ని వయస్సుల వారు ఈ యాప్‌లో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అసభ్యకరమైన హావభావాలను పోస్ట్ చేసిన భార్యను భర్త దారుణంగా కత్తితో పోడిచి హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోవై సమీపంలో జరిగింది. అరివొలినగర్‌కు చెందిన కనకరాజ్(35)కు ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న నందినికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కనకరాజ్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

కుటుంబ తగాదాలతో భార్యాభర్తలు రెండేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. కొద్దిరోజులుగా నందిని టిక్‌టాక్‌లో అసభ్యకరమైన హావభావాలతో వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కనకరాజ్ టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ఆపేయాలని మందలించాడు. భార్యకు ఫాలోవర్స్ పెరగడంతో భర్త తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే మద్యం సేవించిన కనకరాజ్ ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts