telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాంగోపాల్ వర్మ మనుషులు పోలీస్ స్టేషన్లో క్షమాపణ చెప్పారు… అందుకే కేసు వెనక్కు…!!

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అంటూ సెటైరికల్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘‘దమ్ముంటే వచ్చి నాపై దాడి చేయమనండి. నా ఆఫీస్ అడ్రస్ గూగుల్‌లో కొడితే వస్తుంది. ఎమ్మెల్యే కాలనీలో నా కంపెనీ ఉంది’’ అంటూ వర్మ బహిరంగ సవాల్ విసరడం, దీనిపై రియాక్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ వచ్చి వర్మ ఆఫీసు అద్దాలు పగలగొట్టి నానా హంగామా చేయడం.. ఆ వెంటనే పోలీస్ కేసు, రామ్ గోపాల్ వర్మ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో వర్మ Vs పవన్ ఫ్యాన్స్‌‌ ఇష్యూ జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్న రాంగోపాల్ వర్మ కార్యాలయానికి కేవలం మాట్లాడే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళామని OU JACకి చెందిన సంపత్ నాయక్ పేర్కొన్నారు. మమ్మల్ని చూసి రాంగోపాల్ వర్మ తన కార్యాలయం మూడో అంతస్తులో దాక్కున్నాడని, గంట సేపు అక్కడే ఉండి రాంగోపాల్ వర్మని మాట్లాడటానికి రమ్మని నిలబడ్డామని, ఆయన కార్యాలయంలో 70 మంది వరకు ఉన్నారని, కేవలం మాట్లాడే ఉద్దేశంతో అక్కడికి వెళితే దాడి చేశామని ప్రచారం చేసుకున్నారని అన్నారు. ఓయు విద్యార్థులు దాడి చేస్తే ఎలా ఉంటుందో యావత్ దేశం మొత్తం చూసిందని, ఒక వ్యక్తిని విమర్శించే ముందు హద్దు దాటితే పరిణామాలు వేరేలా ఉంటాయని హెచ్చరించిన, ఆయన రాంగోపాల్ వర్మ మనుషులు మాకు పోలీస్ స్టేషన్లో క్షమాపణ చెప్పారని, ఒకరిపై ఒకరు కేసులు అన్నీ విరమించుకోవాలని కోరారని అందుకే ఇరువురం కేసులు వెనక్కు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇకనైనా ఇలాంటి చేష్టలను రాంగోపాల్ వర్మ మానుకోవాలని హెచ్చరించారు.

Related posts