నిర్మాత బండ్ల గణేష్ సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తూనే నిర్మాతగా కూడా ప్రయోగాలు చేసిన బండ్ల గణేష్… గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్లేడు ఇష్యూతో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో తిరిగి కెమెరా ముందుకొచ్చారు. మరోసారి నిర్మాతగా మారి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. మెగా ఫ్యామిలిలో ఇప్పటికే మూడు సినిమాలకు అడ్వాన్స్లు ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలోబ్రతుకే సోబెటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత దేవకట్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నట్లు ప్రకటించాడు. ఇలా వరుసగా బిజీగా ఉన్న తేజ్ బండ్ల బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.