తెలంగాణ సీఎం కేసీఆర్ పై ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని కుహనా రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ కు హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పదిహేను నిమిషాల సమయం ఇస్తే హిందువులందరినీ ఖతం చేస్తామన్న ఎంఐఎంతో కేసీఆర్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.
దేశానికి స్వాతంత్ర్యం రాకుండా అడ్డుకున్న పార్టీ ఎంఐఎం అని , అటువంటి పార్టీతో అంటకాగుతున్న కేసీఆర్ హిందువుల గురించి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని చురకంటించారు.సీఏఏ పై తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. కేంద్రం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సాధ్వి ప్రజ్ఞా సింగ్ ముమ్మాటికీ ఉగ్రవాదే: సిద్ధరామయ్య