telugu navyamedia
సినిమా వార్తలు

‘ఖిలాడి’ మ్యూజిక్ పై ఆస‌క్తి క‌ర విష‌యం చెప్పిన ద‌ర్శ‌కుడు..

మాస్ మహారాజా ర‌వితేజ‌ నటించిన సినిమా ‘ఖిలాడి’. ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. దర్శకుడు రమేశ్ వర్మ ద‌ర్శ‌కత్వంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు.. సినిమాపై మ‌రింత‌ అంచనాల్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా ర‌వితేజ హీరోయిన్ లిప్‌ఖాన్ సీన్‌..ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మ్యూజిక్​కు సంబంధించిన ఆసక్తికర విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమా కథ చెప్పిన వెంటనే ట్యూన్స్​ రెడీ చేశారని రమేశ్ వర్మ చెప్పారు. మొత్తం ఆరు పాటల మ్యూజిక్​ గంటలో పూర్తయిందని అన్నారు. కానీ ఇందులో ఐదింటిని మాత్రమే సినిమా కోసం ఉపయోగించామని దర్శకుడు రమేశ్ వర్మ. చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో అనసూయ కీలకపాత్ర చేసింది. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు.

Related posts