మార్వెల్ సంస్థ నుండి విడుదలయ్యే చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న విషయం విదితమే. ఇటీవల ఈ సంస్థ నుంచి విడుదలైన “అవెంజర్స్” సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను కొల్లగొట్టడమే కాకుండా పలు రికార్డులను తిరగరాసింది. ఇక ఇప్పుడు ఇదే సంస్థ నుంచి సూపర్ హీరో చిత్రం “స్పైడర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ హోం” విడుదలకు సిద్ధమవుతోంది. “స్పైడర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ హోం” చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా విడుదల చేస్తుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జూలై 4న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ “సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే “స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను జూలై 4న విడుదల చేస్తున్నాం. 30నే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళంలో సినిమాను విడుదల చేస్తున్నాం” అని తెలిపారు. ఇది స్పైడర్ మ్యాన్ అభిమానులకు నిజంగా శుభవార్తే మరి.
previous post
తప్పు ఎక్కడ జరుగుతోందో అర్థం కావడం లేదు : శర్వానంద్