telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

జగన్ నిర్ణయం భేష్.. నటుడు నారాయణమూర్తి

Narayana murthy Actor

ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియంను ప్రవేశ పెట్టాలన్న ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి అన్నారు. కాకినాడ సమీపంలోని నడికుదురులో ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు మీడియంలో చదివే పిల్లలు సెక్యూరిటీ గార్డులుగా, పోలీసు కానిస్టేబుళ్లుగా మారుతూ చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతున్నారని చెప్పారు.

ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని ఆయన అన్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకూ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు రావాలన్నదే తన అభిమతమని తెలిపారు. భావి తరాల భవిష్యత్ కోసం ఆంగ్ల విద్య తప్పనిసరని నారాయణమూర్తి పేర్కొన్నారు. తనకు ఎదురవుతున్న సమస్యలు, తాను అనుభవించిన సమస్యలపైనే సినిమాలు తీస్తున్నానని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.

Related posts