మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ యంగ్‌హీరోలకు దీటుగా టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. అరడజను సినిమాలు ప్రస్తుతం చిరు లిస్ట్‌లోఉన్నాయి. పలువురు దర్శకులకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
ప్రస్తుతం మెగాస్టార్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ ఆచార్య రిలీజ్ కు రెడీగా ఉంటే.. గాడ్ ఫాదర్ సెట్స్ మీద ఉంది. డైరెక్టర్ బాబీతో, మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమాలతో ప పాటు వెంకీ కుడుమలతో మరో సినిమా ఫిక్స్ అయ్యారు. మరో రెండు సినిమాలు కూడా హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
ఇకపోతే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టే.. అటు కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత బ్రాండ్ అంబాసిడర్ గా చేయబోతున్నారు.
తాజాగా ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు చిరు సైన్ చేసినట్లు తెలుస్తోంది. రియల్-ఎస్టేట్ సంస్థ పనితీరు నచ్చడం వల్లే చిరు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఓకే చెప్పారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
గతంలో చిరు ‘థంబ్స్‌అప్’, ‘నవరత్న ఆయిల్’ బ్రాండ్స్ ప్రకటనల్లో కనిపించారు. ఇప్పటికే చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఓ రియల్-ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
తిని కూర్చొని బరువు పెరగడం లేదు : నిత్యామీనన్