telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గీతాంజలి మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం

KCR cm telangana

టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆమె మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. సినీ సెల‌బ్రిటీలు గీతాంజ‌లి మృతికి సంతాపం తెలియ‌జేస్తూ, కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆమె పార్థివదేహాన్ని ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు సినిమాకు సంబంధించిన వారి సందర్శన కోసం ఫిలింఛాంబర్ లో ఉంచుతామని మా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ తెలిపారు. అక్కడ నుంచి 5 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా గీతాంజలి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సీతారామకళ్యాణం’ సినిమాలో సీతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. వివిధ భాషల్లో 500 పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో తన తన నటనతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Related posts