telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సగం మెదడుతో బతికేస్తున్న మనిషి… మిరాకిల్

Doctors Discover Man Has Lived 60 Years With Half His Brain

సహజంగా ప్రతి మనిషికి మెదడులో రెండు భాగాలు ఉంటాయి. వీటిని లెఫ్ట్ హెమిస్పియర్ అండ్ రైట్ హెమిస్పియర్ అంటారు. ఎడమ భాగం సైన్స్, మ్యాథ్స్ ఇలా లాజిక్‌తో ఆలోచించే వాటికి ఉపయోగపడితే… కుడి భాగం క్రియేటివిటీ, ఆర్ట్స్‌కు ఉపయోగపడుతుంది. అయితే రష్యాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం సగం మెదడుతోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా బతుకుతూ వచ్చేస్తున్నాడు. ఈ 60 ఏళ్ల వ్యక్తికి ఎడమ పక్కన ఉండాల్సిన హెమిస్పియర్ అసలు లేనేలేదు. ఎక్స్‌రే తీస్తే అందులో ఒక పక్కంతా నల్లగా ఉండటం చూసి డాక్టర్లు సైతం షాకయ్యారు. రష్యన్ ఇంజనీర్‌గా పని చేసి ప్రస్తుతం రిటైర్ తీసుకుంటున్న సమయంలో ఇస్కీమిక్ అటాక్ (మెదడులో వచ్చేది) రావడంతో ఈ విషయం బయటపడింది. చికిత్స కోసం ఆ వ్యక్తి దక్షిణ మాస్కో వెళ్లగా అక్కడి న్యూరాలజిస్ట్‌లు మెదడు ఎక్స్‌రే చూసి కంగుతిన్నారు. మెదడులో ఒక భాగం లేకుండానే చిన్నప్పటి నుంచి చదువు, తరువాత పెళ్లి, ఉద్యోగం.. ఇలా జీవితం మొత్తాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా నెట్టుకురావడం నిజంగానే మిరాకిల్‌ అంటున్నారు వైద్యులు. అంతేకాకుండా రెడ్ ఆర్మీలో కూడా ఆ వ్యక్తి తన సేవలను అందించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే ఈ విషయం బయట చెప్పవద్దని ఆ వ్యక్తి డాక్టర్లను కోరడంతో… అతని సమాచారాన్ని వైద్యులు రహస్యంగానే ఉంచారు.

Related posts