దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శిరీష్ దీక్షిత్ కరోనాతో తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. మృతునిలో పెద్దగా లక్షణాలేమీ కనపడకపోగా, ఈ ఉదయం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వైద్య బృందం ఇంటికి చేరుకునే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనాతోనే మృతి చెందినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముంబయిలో కరోనా ప్రభావం అత్యంత తీవ్రస్థితిలో ఉంది. ఇప్పటివరకు ఈ నగరంలో 82,968 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,969 మంది మరణించారు.
కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించాడు: రేవంత్ రెడ్డి