telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వీసీ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి: కేసీఆర్

KCR cm telangana

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామకం కోసం ప్రభుత్వం నొటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సెర్చ్ కమిటీ నుండి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ)ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈసీ ఏర్పాటుతో వీసీల నియామకం సులభం అవుతుందని సీఎం అధికారులకు నిర్దేశించారు. ఈసీ, వీసీల నియామక ప్రక్రియ 2-3 వారాల్లోనే జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇటీవలే ప్రభుత్వం ఉస్మానియాయూనివర్సిటీ, కాకతీయయూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు వీసీల నియామకం కోసం నొటిఫికేషన్ విడుదల చేసింది.

Related posts