రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని సీఎం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సినీ పెద్దలు స్పందించి కేసీఆర్‌కు థాంక్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి… కేసీఆర్, విధివిధానాలు రూపొందించిన తలసాని శ్రీనివాస యాదవ్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘‘మా అభ్యర్థన మన్నించి తిరిగి షూటింగ్స్ ప్రారంభించుకోవడానికి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి ధన్యవాదాలు. అలాగే చర్చల్లో కీలక పాత్ర పోషించిన తలసాని శ్రీనివాసయాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని తెలిపారు రాజమౌళి. తెలంగాణలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు.
previous post
next post
విశాల్ నన్ను పెళ్ళి చేసుకుంటానని అడిగారు… కానీ…!