నా ప్రేయసి కళ్ళల్లో
కోటి కాంతులు
ఇక నాకు
దీపావళి ఎందుకు ?
నా చెలి అధరాలలో
తియ్యటి మధురాలు
ఇక నాకు
మామిళ్ళు ఎందుకు ?
నా సఖి బుగ్గలో
సిగ్గుల ముగ్గులు
ఇక నాకు
సంక్రాంతి ఎందుకు ?
నిత్యం నా ముందు
ఆమె ఉంటే
ప్రతి రోజు
నాకు పండుగే కదా !
-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తీ