telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గవర్నరును కలిసేందుకు టీడీపీ నేతల ప్రయత్నం…’

varlaramaiah tdp

రాజ్ భవను కు వెళ్లిన టీడీపీ నేతలు గవర్నర్ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ గవర్నరు మూల విరాట్ అని, మూల విరాట్ మమ్మల్ని కలవడం లేదు..పూజారిని కలవమని చెప్తున్నారని అన్నారు. రెండు మూడు సార్లుగా ఇలాగే జరిగిందని, మేం వస్తే సెక్రటరీ కూడా లేడు… ఆయన పీఏకి ఇచ్చి వెళ్ళండి అని చెప్తున్నారని అన్నారు. గవర్నర్ అప్పాయింట్మెంట్ ఇవ్వకపోతే మేం ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. సీఎం ప్రజలను కలవరు.. గవర్నర్ ప్రజా ప్రతినిధులను కలవరని అన్నారు. ఈ సారి గవర్నర్ అప్పాయింట్మెంట్ ఇవ్వకపోతే రాజ్ భవన్ వద్ద ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. ఉద్యోగస్తులను బెదిరించిన అంశంలో వెంటనే పోలీసులు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలని, పెద్దిరెడ్డిని క్యాబినెట్ నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. బోండా ఉమ మాట్లాడుతూ పెద్దిరెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎస్ఈసీ పరిధిలో ఉన్న అధికారులను బెదిరించడం ఏంటి..? అని ప్రశ్నించారు. రాజ్యాంగ విచ్చిన్నం ఏపీలో జరుగుతుందని, రాజ్యాంగ అధినేత కాబట్టి గవర్నర్ దృష్టికి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను తీసుకొచ్చామని అన్నారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts