telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 17న తెలంగాణ కేబినేట్ సమావేశం

KCR cm telangana

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఈ నెల 17వ తేదీన జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఈ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో నూతన పురపాలక చట్ట బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఈ నెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలకోసం జులై 12వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, మరుసటిరోజు (19న) మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయని ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో నూతన పురపాలకచట్టం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Related posts