telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కృష్ణ వంశీకి అసిస్టెంట్ గా మారిన ప్రకాష్ రాజ్..!

Prakash

కృష్ణ వంశీ ప్ర‌స్తుతం ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రంగ‌మార్తాండ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ్ర‌హ్మానందం గ‌తంలో ఎప్పుడు చేయ‌ని పాత్ర పోషిస్తున్నారు. రంగ‌స్థ‌ల న‌టులు ఇందులో భాగం కానున్నారు. అయ‌తే ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండగా, సెట్‌కి సంబంధించిన ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. కృష్ణ‌వంశీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ సెట్‌లో ఫోటో ఫ్రేమ్‌ ఏర్పాటు చేస్తుండ‌గా, వారికి ప్ర‌కాశ్ రాజ్ సాయం చేసాడు. ఇది చూసిన కృష్ణ‌వంశీ వీడియో తీసి త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ .. “నా టీమ్‌లో కొత్త అసిస్టెంట్‌.. గాడ్ బ్లెస్‌ హిం” అంటూ కామెంట్ చేశాడు. రంగ‌మార్తాండ‌ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్‌ రాజ్‌, కేవలం నటుడిగా తన సీన్స్‌ పూర్తి చేసుకోని వెళ్లిపోవటం లేదు. సెట్‌లో అసిస్టెంట్‌లతో కలిసి ఇతర పనుల్లో సాయం చేస్తున్నాడు.

Related posts