telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : “ఉక్కు హృద‌‌యం” టాస్క్ లో అవినాష్ బర్త్ డే వేడుకలు

Bigg-Boss-4

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ సీజన్ లో అంతా కొత్త కంటెస్టెంట్లు అయినప్పటికీ మంచి వినోదాన్ని, తమదైన ఎమోషన్స్‌ను పండిస్తున్నారు. ఇంటి సభ్యుల్లో మెహబూబ్‌, అరియానా, కుమార్‌, మోనాల్‌, హారిక, లాస్య, దేవిలతో కలిసి ఈ వారం మొత్తం ఏడుగురు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారని బిగ్‌బాస్‌ ప్రకటించారు. మరి ఈ ఏడుగురిలో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే.

అస‌లే నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో మంట మీదున్న కంటెస్టెంట్లు నేటి టాస్క్‌లో త‌మ స‌త్తా ఏంటో చూపించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఈ ఫిజిక‌ల్ టాస్క్ గొడ‌వ‌ల‌కు దారి తీసింది. దేవీ, మెహ‌బూబ్ మ‌ధ్య మాటామాటా పెర‌గ‌డంతో ఇంటి స‌భ్యులు క‌ల్పించుకుని స‌ర్ది చెప్పాల్సి వ‌చ్చింది. ఫిజిక‌ల్ టాస్క్ ఆడ‌గ‌లుగుతుందా అన్న అనుమానాన్ని గంగ‌వ్వ ప‌టాపంచ‌లు చేసింది. రోబో వేషం క‌ట్టిన అవ్వ ప్ర‌త్య‌ర్థుల‌ను ద‌గ్గ‌రికి కూడా రానీయ‌లేదు. ఇక‌ తెలుగు మాట్లాడ‌ట‌మే క‌ష్టంగా ఉండే మోనాల్ ఏకంగా తెలుగు ప‌ద్యాల‌ను అప్ప‌జెప్పింది.

బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌కు “ఉక్కు హృద‌‌యం” టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న సిల్వ‌ర్ బాల్‌ను మ‌నుషులు ప‌గ‌ల‌గొడితే ఓ రోబో చ‌నిపోయిన‌ట్లు. అలా అన్ని రోబోల‌ను చంపేస్తే మ‌నుషుల టీమ్ గెలిచిన‌ట్లు లెక్క‌. ఒక్క రోబో బ‌తికున్నా రోబోల టీమ్ గెలిచిన‌ట్లే. ఇక్కడో ట్విస్ట్ ఉంది. గెలిచిన టీమ్ స‌భ్యులు మాత్ర‌మే కెప్టెన్ పోటీకి అర్హులు. మ‌నుషుల టీమ్‌లో అఖిల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, దివి, నోయ‌ల్‌, సోహైల్, సుజాత‌,ఉన్నారు. రోబోల టీమ్‌లో దేవి, అరియానా, కుమార్ సాయి, లాస్య‌,అవినాష్‌, అభిజిత్‌, గంగ‌వ్వ‌, హారిక‌ ఉన్నారు. బ‌జ‌ర్ మోగ‌క‌ముందే అత్యుత్సాహంతో ఇరు టీమ్‌లు ఆట మొద‌లెట్టేశారు. కిచెన్‌లో ఉన్న ఆహారాన్నంతా మ‌నుషులు కోతుల్లా దోచుకుంటూ తీసుకువెళ్ల‌డంతో రేష‌న్ మేనేజ‌ర్ అభి వారిపై సీరియ‌స్ అయ్యాడు. మ‌నుషుల టీమ్‌ను మ‌నం ఆప‌లేమ‌ని త‌న రోబో టీమ్ మెంబ‌ర్స్‌లో నిరుత్సాహాన్ని నింపాడు. మ‌నం ఏం చేయ‌లేమ‌ని ఆట కూడా స‌రిగా ఆడ‌లేదు. జోష్‌తో ఆడుతున్న‌ మ‌నుషుల టీమ్‌పై దేవి మండిప‌డింది. ఏంటీ పిచ్చి గేమ్ అని అరిచింది. దీంతో ఆమెనే టార్గెట్ చేసిన ప్ర‌త్య‌ర్థి గేమ్ మొద‌ట దేవినే చంపేసింది. కాసేప‌టివ‌ర‌కు రోబోలు మ‌నుషుల్ని ఆడుకోగా త‌ర్వాత వీళ్ల వంతు రావ‌డంతో ఇంటి లోప‌ల ఉన్న రోబోల‌ను డ్యాన్సుతో ఉడికించారు. పైగా లోన ఉన్న రోబోలు పుష్టిగా భోజ‌నం చేస్తే బ‌య‌ట ఉన్న మ‌నుషులు మాత్రం తిన‌కుండా మాడిపోయారు, క‌నీసం వాష్ రూమ్ ఉప‌యోగించుకోడానికి కూడా లేదు. దీంతో అంద‌రూ దుప్ప‌టి అడ్డుపెట్ట‌డంతో సుజాత వాష్‌రూమ్‌కు వెళ్లింది. వీరి తెగింపును చూసి రోబోలు షాక్‌కు లోన‌య్యారు. అయితే కెమెరాల‌కు అడ్డుగా నిలిస్తే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని బిగ్‌బాస్‌ హెచ్చ‌రించాడు. త‌ర్వాత‌ అవినాష్‌ బ‌ర్త్‌డేను మ‌నుషుల టీమ్ సెల‌బ్రేట్ చేశారు. ఈరోజు ఎపిసోడ్ లో గెలుపెవరిదో తెలిసే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు బిగ్ బాస్ హౌజ్ లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Related posts