telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విమర్శలకు పిట్టకథతో కౌంటర్ ఇచ్చిన సోనూసూద్

Sonu-Sood

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన చేస్తున్న సామాజిక సేవను తప్పు బడుతూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఏదో ప్రయోజనం ఆశించే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నారంటూ సోనూసూద్‌పై వస్తున్న ట్రోల్స్ కు ఆయన స్పందించారు. ఓ ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ పిట్ట కథను చెప్పారాయన. “‘ఓ సాధువు వద్ద ఉత్తమ జాతి గుర్రం ఉండేది. ఆయన వద్దకు ఓ దొంగ వచ్చి.. ఆ గుర్రాన్ని తనకు ఇవ్వాలని అడుగుతాడు. అందుకు సాధువు తిరస్కరిస్తాడు. అనంతరం అడవి వైపుగా సాధువు ప్రయాణిస్తుండగా దారిలో నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడు కనిపిస్తాడు. సాధువు జాలిపడి ఆ ముసలాయనకు తన గుర్రాన్ని ఇచ్చేస్తాడు. తానే ఆదొంగను అని అసలు విషయం చెప్పి వృద్ధుడు అక్కడి నుంచి వెళ్లబోతాడు. సాధువు ఆపి, గుర్రాన్ని నిరభ్యంతరంగా తీసుకోగానీ ఈ విధంగా తీసుకున్నట్లు ఎవ్వరికీ చెప్పొద్దని కోరతాడు. ప్రజలకు ఈ విషయం తెలిస్తే వాస్తవంగా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి కూడా సందేహిస్తారని అన్నాడు” అంటూ తనపై ట్రోల్స్ చేసే వారికి కౌంటర్ ఇచ్చాడు సోనూసూద్.

Related posts