telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ రిజెక్ట్ చేసిన “గ్యాంగ్ లీడర్”

Mahesh Babu

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం)లు ప్రొడక్షన్‌ నెం.8గా నిర్మిస్తున్న చిత్రం పేరుని “గ్యాంగ్ లీడర్”గా ప్రకటించిన విషయం తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటికే టైటిల్‌పై రచ్చ జరుగుతుంటే… ఇప్పుడు ఈ సినిమా నాని కంటే ముందు మహేష్ బాబు వద్దకు వెళ్లిందనే వార్త వైరల్ అవుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో మహేష్ బాబు హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నప్పటికీ స్టోరీ నచ్చకపోవడంతో మహేష్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడని అంటున్నారు. ఆ తర్వాత ఈ స్టోరీని నాని ఓకే చేయడంతో విక్రమ్, వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లాడని అంటున్నారు.

Related posts