telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోదరుడి పెళ్ళిలో రష్మీ హంగామా… వీడియో వైరల్

rashmi

“జబర్దస్త్” యాంకర్ రష్మీ గౌతమ్ ఒకవైపు షోలు చేస్తూనే, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కన్పిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్లలో రష్మీ ఒకరు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ గా ఉంటూ తన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా పలు సామజిక అంశాలపైనా రష్మీ స్పందిస్తూ ఉంటారు. అయితే జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. అందులో ఎక్స్ ‌ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ఈ ప్రోగ్రామ్‌కు ముందు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. ర‌ష్మి మంచి బ్రేక్ కోసం వేచి చూస్తుంది. సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌ష్మి గౌత‌మ్ త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూ ఉంది. బుల్లితెర‌, వెండితెర‌కే పరిమిత‌మైన ర‌ష్మి గౌత‌మ్ ఇప్పుడు డిజిట‌ల్ మీడియంలోకి ఎంట్రీ ఇస్తుంది. రీసెంట్‌గా వైజాగ్‌లో త‌న సోద‌రుడి పెళ్లి వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌గా, ఈ వేడుక‌లో ర‌ష్మి సంద‌డి మాములుగా లేదు. సాంప్రదాయంగా లంగా ఓణీ ధరించి స్టైలిష్ గా ఉన్న ర‌ష్మి బారాత్‌లో తీన్‌మార్ స్టెప్పులు వేసి అంద‌రు నోరెళ్ళ‌పెట్టేలా చేసింది. త‌న కుటుంబ స‌భ్యుల‌తో సైతం డ్యాన్స్ చేయించింది. ర‌ష్మి స్టెప్పుల‌ని చూసిన చుట్టు ప‌క్క‌ల వారు ఫిదా అయ్యారు. వైజాగ్ లో జ‌రిగిన రష్మి సోదరుడు మలేయ్ త్రిపాఠి వివాహంలో కుటుంబ సభ్యులంతా సాంప్రదాయ దుస్తుల్లో క‌నిపించారు. ఈ వివాహానికి పలువురు రాజకీయ, వెండితెర, బుల్లి తెరకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ వేడుక కోసం త‌న ప‌నుల‌న్నీ ప‌క్క‌న పెట్టి వారం రోజుల ముందే ఇంటికి వెళ్ళిందట ర‌ష్మి. ఇక త‌మ్ముడి పెళ్లి హ‌డావిడి పూర్తి కావ‌డంతో త్వ‌ర‌లో త‌న ప్రొఫెష‌న‌ల్ వ‌ర్క్‌తో బిజీ కానుంది ర‌ష్మి.

Related posts