telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒక్క అవకాశంతో .. మళ్ళీ సింగరేణిలోకి .. 356 కార్మికులు..

funds to telangana by central govt

సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంతో డిస్మిస్ అయిన ఉద్యోగుల్లో సుమారు 356 మందికి తిరిగి ఉద్యోగావకాశం ఏర్పడింది. వివిధ కారణాల రీత్యా 2000 సంవత్సరం నుండి 2018 మద్య డిస్మిస్ అయిన కార్మికులను ”ఒక్క అవకాశంగా” తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఒక చారిత్రక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2000 సంవత్సరం నుండి గత ఏడాది వరకూ దీర్ఘకాలంగా గైర్హాజరు, అనారోగ్య కారణాల వలన విధులకు హాజరు కాకుండా డిస్మిస్డ్ అయిన కార్మికులకు ఈ ఒప్పందం ద్వారా తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం కల్పించారు. పలుమార్లు డైరెక్టర్ పా ఎస్.చంద్రశేఖర్, జి.ఎం. పర్సనల్ (ఐ.ఆర్., పి.ఎం.&ఆర్.సి.) ఎ.ఆనందరావు తో గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శ్రీ బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, తదితరులు చర్చించిన మీదట ఈరోజు శుక్రవారం (సెప్టెంబర్ 20వ తేదీ) నాడు ఒప్పందం కుదుర్చుకొని 356 మందికి తిరిగి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.

ఈ ఒప్పంద పత్రాలపై గుర్తింపు కార్మిక సంఘం నుండి బి.వెంకట్రావు (అధ్యక్షులు), మిర్యాల రాజిరెడ్డి (జనరల్ సెక్రటరీ), కె.వీరభద్రయ్య (సెంట్రల్ కమిటీ మెంబర్) యాజమాన్యం తరపున డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్, జి.ఎం. పర్సనల్ (ఐ.ఆర్., పి.ఎం & ఆర్.సి.) ఎ.ఆనందరావు, జి.ఎం. (ఎం.ఎస్) ఎ.ఋష్యేంద్రుడు, డి.జి.ఎం. (పర్సనల్) ఐ.ఆర్. జె.చిత్తరంజన్ కుమార్ లు సంతకాలు చేశారు. ఉద్యోగంలో చేరగొరే డిస్మిస్డ్ కార్మికులు ధరఖాస్తు తర్వాత కంపెనీ ఆసుపత్రులలో వైద్య పరీక్షలలో ఫిట్ కావాల్సి ఉంది. డిస్మిస్డ్ కార్మికులకు ఈ ఒప్పందం ఒక వరం లాంటిదని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్ ఎస్చంద్రశేఖర్ పేర్కొన్నారు. మానవత దృకృధంతో, ఎక్కువ మంది డిస్మిస్డ్ కార్మికులు తిరిగి ఉద్యోగంలో చేరేలా అవకాశం కల్పించామని. తిరిగి ఉద్యోగంలో చేరి, క్రమశిక్షణతో పనిచేస్తూ, కంపెనీకి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని తెలియజేశారు.

Related posts