దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవరస్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జూలై 30న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా కనిపించనుంది. మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ మొదలుకానుంది. చారిత్రాత్మక సినిమా కావడంతో ఇందులో గుర్రపు స్వారీలు, భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. దానికోసం ఎన్టీఆర్ ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుర్రాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకుని దానితో ఆటలాడుతున్నాడు తారక్.
. @tarak9999 😍😍 pic.twitter.com/vA4EE885Nv
— Akhil Tarak (@AkhilTarak99) June 26, 2019