telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సౌత్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్

Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తరువాత ఎంతటి పాపులారిటీ వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా తర్వాత వచ్చిన “సాహో” ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఇక ప్రభాస్ ఈ మధ్యే సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేశాడు. తాజాగా ఫేస్ బుక్ లో ప్రభాస రికార్డ్ క్రియేట్ చేసాడు. ప్ర‌స్తుతం ప్రభాస్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య 16 మిలియన్స్ కి చేరింది. ఫేస్ బుక్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ స్టార్ గా ప్ర‌భాస్ రికార్డు క్రియేట్ చేశారు. కేవలం 7 రోజుల్లో 1 మిలియన్ మంది ప్ర‌భాస్‌ని ఫాలో చేశారంటే సోష‌ల్ మీడియాలో ప్రభాస్ క్రేజ్ ఏవిధంగా ఉందొ అర్థమవుతోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్నాడు.

Related posts