telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ వచ్చేసింది…

మెగా హీరో వరుణ్ తేజ్ తన మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు పొండాదు. ఆ తర్వాత తొలిప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ వంటి హిట్లు అందుకుని కొత్త సినిమాలతో చెలరేగుతున్నాడు. ఇప్పుడు తాజాగా తన నూతన చిత్రం కోసం బాక్సర్‌గా మారాడు. వరుణ్ తేజ్ పదవ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో వస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్లను నేడు విడుదల చేసారు. ”గని” పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో పాత్ర కోసం వరుణ్ తేజ్ బాక్సర్ ఫిజిక్ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో పంచింగ్ బ్యాగ్‌పై ప్రాక్టీస్ చేస్తూ పవర్ ఫుల్ పంచ్ కొడుతున్నాడు. ఎంతో ఏకాగ్రతగా ప్రాక్టీస్ చేస్తున్న బాక్సర్‌లా వరుణ్ తేజ్ పాత్రలో ఇమిడిపోయాడు. ఇదిలా ఉంటే వరుణ్ ప్రస్తుతం అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎఫ్3 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా భారీ హిట్ అయిన ఎఫ్2కు సీక్వెల్‌గా రూపొందుతోంది. దీనిని కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ డబ్బు వల్ల వస్తాయని తెలిపారు. దీంతో పాటుగా వరుణ్ తేజ్ తన బాక్సింగ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను కిరన్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా అల్లు బాబి, సిద్దు నిర్మెస్తున్నారు.

Related posts