టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అన్ని రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ స్వచ్ఛందంగా మొక్కలు నాటుతున్నారు. తాజాగా బాహుబలి స్టార్ ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించింది బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్. ఈరోజు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బొంబాయిలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి శ్రద్ధా కపూర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
previous post