telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘వకీల్‌ సాబ్’ షూటింగ్ లో పాల్గొంటున్న హీరోయిన్

Niveda

పవన్ కళ్యాణ్ ‘వకీల్‌ సాబ్’ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ చిత్రంలో అంజలి, నివేత థామస్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. హిందీలో హిట్టయిన ‘పింక్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం లాక్ డౌన్ కి ముందు జరిగిన షెడ్యూల్ లో పూర్తయింది. లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది. ప్రస్తుతం పవన్ లేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న కథానాయిక నివేత థామస్ కూడా తాజాగా ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని నివేత సోషల్ మీడియాలో వెల్లడించింది. “తిరిగి షూటింగుకి రావడం బాగుంది” అంటూ నివేత పోస్ట్ పెట్టింది. పవన్ కూడా త్వరలోనే ఈ చిత్రం షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

Related posts