telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

గుంటూరు వరకు .. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ .. !

uday express between vijayawada and visakha

ప్రస్తుతం విశాఖపట్టణం – విజయవాడ – విశాఖపట్టణం మధ్యన ప్రవేశపెట్టిన ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ని గుంటూరు వరకు పొడిగించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ రైలుకు విజయవాడలో ఆక్యుపెన్సీ శాతం తక్కువగా ఉండటం, అక్కడ ప్లాట్‌ఫారం కొరతతో గుంటూరుకు పొడిగించేందుకు ఆ డివిజన్‌ అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేశారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి ఇటీవలే గుంటూరు రైల్వే డివిజన్‌కు లేఖ అందింది. ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరులో టైమింగ్స్‌ ఇవ్వాల్సిందిగా జోనల్‌ అధికారులు కోరగా డివిజనల్‌ ఆపరేషనల్‌ అధికారులు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని టైమింగ్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన రైల్వేబోర్డుకు వెళ్లింది. దీనికి అతిత్వరలోనే బోర్డు పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లుగా రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

రెండు నెలల క్రితం ఈ రైలు పట్టాల మీదకు వచ్చింది. నెంబరు. 22701 విశాఖపట్టణం – విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ గురు, ఆదివారంలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో వేకువజామున 5.45 గంటలకు బయలుదేరి దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదగా ఉదయం 11.15కి విజయవాడకు వస్తుంది. అలానే నెంబరు. 22702 విజయవాడ – విశాఖపట్టణం ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆయా రోజుల్లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్టణం చేరుకొంటుంది. మొత్తం 10 ఏసీ చైర్‌కార్‌ బోగీలతో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. జనరల్‌ కోటాలో 888 టిక్కెట్‌లున్నాయి. ఇవికాక తత్కాల్‌ కోటాలో మరో 120 వరకు ఏసీ ఛైర్‌కార్‌ సీట్లు ఉన్నాయి.

Related posts