సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.
అలాగే కళావతి సాంగ్ ప్రోమో కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ పాటను షెడ్యూల్‌కి ఒకరోజు ముందే మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ‘వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ, కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి’ అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటాయి.
ఈ వీడియోలో మహేష్ – కీర్తి ల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు.
మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను జిఎంబి ప్రొడక్షన్స్ , మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 12వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల’ కానుంది.
షబానా కామెంట్స్ పై కంగనా సోదరి కౌంటర్