నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ “118”. కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ నేపధ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మేరకు జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 14 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, అందులో ఏడు కోట్లు థియేట్రికల్ బిజినెస్ అని చెప్తున్నారు. అన్ని ఖర్చులు కలిపి 11 కోట్లు పెట్టారని, కాబట్టి మూడు కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని సమాచారం.
ఏరియాల వారీగా కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ :
నైజాం & ఆంధ్రా – రూ. 5.00 కోట్లు
సీడెడ్ – రూ. 1.00 కోట్లు
అమెరికా &మిగిలిన ప్రాంతాలు – రూ. 0.90 కోట్లు
మొత్తం ధియోటర్ రైట్స్ – రూ. 6.90 కోట్లు
హిందీ డబ్బింగ్ రైట్స్ – రూ. 4.00 కోట్లు
శాటిలైట్ రైట్స్ – రూ. 3.10 కోట్లు
మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ – రూ. 14.00 కోట్లు