telugu navyamedia
సినిమా వార్తలు

‘పక్కా కమర్షియల్‌’మూవీ రివ్యూ..

గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’. భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేట‌ర్స్‌లో విడుదలైంది.

కథేంటంటే...

సూర్య నారాయణ (సత్య రాజ్‌) ఓ నిజాయితీ గ‌ల‌ న్యాయమూర్తి. వ్యాపారవేత్త వివేక్‌ (రావు రమేశ్‌) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ న్యాయవాద వృత్తికి రాజీనామా రాజీనామా చేస్తారు. నల్లకోటు తీసి కిరాణా షాపు పెట్టుకుంటారు. అతని కొడుకు లక్కీ(గోపిచంద్‌) కూడా లాయర్‌ అవుతాడు. కానీ తండ్రిలా నిజాయతీగా కాకుండా మార్కెట్‌లో అవలీలగా న్యాయాన్ని అమ్మెస్తుంటాడు. తప్పు ఒప్పు చూడకుండా పక్కా కమర్షియల్‌గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదిస్తాడు.

Pakka Commercial Teaser: Have you ever done it .. Dirty Gopichand » Jsnewstimes

కొడుకు నిజస్వరూపం ఒక రోజు తండ్రికి తెలుస్తుంది. పైగా, ఎవరి వల్ల అయితే తాను న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశాడో… ఆ వివేక్ (రావు రమేష్) దగ్గర డబ్బులు తీసుకుంటూ, కేసుల నుంచి బయట పడేయడానికి ప్రయత్నించడం సూర్యనారాయణకు నచ్చదు.

Pakka Commercial Movie Photos
అయితే వివేక్‌ వల్ల బాధింపబడిన యువకుడి కోసం, అతని భార్య కోసం మళ్ళీ నల్లకోటు వేసుకుని కోర్టులో లాయర్‌గా అడుగుపెడతాడు సూర్య నారాయణ. కొడుకు వాదించే విలన్ వివేక్ కేసుకు ఎదురు వాదిస్తాడు.

Pakka Commercial Trailer: Action And Entertainment

 

తండ్రి, కొడుకుల్లో ఎవరు గెలిచారు..లక్కీ పక్కా కమర్షియల్ గా మారటం వెనక ఉన్న రహస్య ఎజెండా ఏమిటి… ..తండ్రి,కొడుకులు ఒకటి అయ్యారా.. టీవి సీరియల్ సీనియర్ ఆర్టిస్ట్ ఝాన్సి (రాశిఖన్నా) కథేంటి… . ఆమె ఎందుకు టీవి సీరియల్స్ ని ప్రక్కన పెట్టి, లక్కీ దగ్గర అసెస్టెంట్ గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. చివరకు, ఏమైంది? అనేది మిగతా కథ.

Gopichand and Raashi Khanna's Pakka Commercial Trailer Out

ఎలా ఉదంటే..

మారుతి సినిమాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. క్యారెక్టరైజేషన్స్ విషయంలో మారుతి మరోసారి తన మార్క్ చాటారు. ఓ లీగల్ పాయింట్ ని తీసుకుని మారుతి తనదైన ఫన్ ట్రీట్మెంట్ , ఎమోషన్ తో నెట్టుకెళ్లే ప్రయత్నం చేసారు.. టైటిల్‌కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు.

Gopichand, Raashii Khanna's 'Pakka Commercial' teaser clocks 4 million views | Telugu Movie News - Times of India

నటీనటులు ఎలా చేశారు?

డబ్బు కోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే పక్కా కమర్షియల్‌ లాయర్‌ లక్కీ పాత్రలో గోపిచంద్‌ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఇక చాలా గ్యాప్‌ తర్వాత తనదైన కామెడీతో నవ్వించాడు.ఫైట్‌ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు.
ముఖ్యంగా ఒక సీరియల్‌ హీరోయిన్‌ ‘లాయర్‌ ఝాన్సీ’గా రాశీఖన్నా ఇరగదీసింది. స్క్రీన్‌పై చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. సీరియల్‌ భాషలో ఆమె చెప్పే డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి..

Gopichand Pakka Commercial Movie

రొటీన్‌ కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్‌ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్‌కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సినిమాల్లో వచ్చే ఫైట్‌ సీన్స్‌పై వేసిన సెటైర్‌, రావు రమేశ్‌, అజయ్‌ ఘోష్‌ల మధ్య వచ్చే సీన్స్‌ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్‌ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది.

Pakka Commercial: 'పక్కా కమర్షియల్' మూవీ ప్రెస్ మీట్ ఫోటోలు | Pakka Commercial Movie Press Meet

ఇక హీరో తండ్రి సూర్యనారాయణ పాత్రలో సత్యరాజ్‌ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు చేయడం ఆయనకు కొత్తేమి కాదు. మారుతి గత సినిమాల మాదిరే ఇందులో కూడా రావు రమేశ్‌ పాత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. విలన్‌ వివేక్‌గా తనదైన నటనతో మెప్పించాడు. సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. బన్ని వాసు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరగా ..

థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు రెండున్నర గంటలు పక్కా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అందించడం కోసం తీసిన చిత్రమిది.

Related posts