telugu navyamedia
సినిమా వార్తలు

పూరీ డై హార్డ్ ఫ్యాన్ ఏం చేశాడో తెలిస్తే షాకే…!!

Ram-and-Puri

ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంక‌ర్” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. జూలై 18న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ తొలి రోజే ఊహించ‌ని క‌లెక్ష‌న్స్ సాధించింది. పూరి జగన్నాథ్ స్టైల్ లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రం కాగా, మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు.18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన “ఇస్మార్ట్ శంక‌ర్” ఓవర్సీస్ తప్పించి.. మిగిలిన అన్ని ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టింది. చాలా రోజుల త‌ర్వాత ఇటు పూరీకి ఇటు రామ్‌ ఖాతాలో “ఇస్మార్ట్ శంక‌ర్”తో హిట్ పడింది. టెంప‌ర్ త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమా ఇటు రామ్‌కి, అటు పూరీకి చెప్ప‌లేనంత ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ ఆనందాన్ని అభిమానుల‌తో షేర్ చేసుకునేందుకు చిత్ర బృందం పలు ప్రాంతాల‌లో సక్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటుంది. తాజాగా హ‌న్మ‌కొండ‌కి వెళ్లిన పూరీకి ఓ అభిమాని స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. త‌న ఛాతిపై వేసుకున్న ప‌చ్చ‌బొట్టుని చూపిస్తూ కాళ్ళు మొక్కాడు. దీనికి సంబంధించిన వీడియోని ఛార్మి కౌర్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. “డై హార్డ్ ఫ్యాన్ ప్ర‌భాక‌ర్ త‌న ఛాతిపై పూరీ టాటూ వేయించుకున్నాడు. నువ్వు నా హృద‌యాన్ని తాకావు” అని కామెంట్‌లో తెలిపింది. ఆ మ‌ధ్య రామ్ అభిమాని ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కావాల‌ని మోకాళ్ళ‌తో తిరుమ‌ల మెట్లెక్కాడు. ఈ వీడియో రామ్ కంట ప‌డ‌డంతో ఆయ‌న భావోద్వేగంతో స్పందించిన విషయం తెలిసిందే.

Related posts