భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మించారు. జూలై 26న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన విషయం విదితమే. తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు రావడంతో కలెక్షన్స్ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 34.32 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టగా, రూ.20.70 షేర్‌ని కలెక్ట్ చేసింది.
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇటీవల విజయ్ తో పాటు చిత్ర నిర్మాతలతో కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రాన్ని వీక్షించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఆయన “ఇదొక గొప్ప ప్రేమ కథ. మంచి సందేశం ఉంది. నటీనటులతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ సంస్థపై ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాననే విషయం తెలపడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ చిత్రం రీమేక్‌లో దఢఖ్ పెయిర్ ఇషాన్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్‌లుగా నటిస్తారని సోషల్ మీడియాలో పలు వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిని కరణ్ కొట్టి పారేశారు. అయితే హిందీ రీమేక్‌కి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. హిందీ రీమేక్ కోసం కరణ్ జోహార్ రూ.6.2 కోట్లు ఇచ్చి రైట్స్‌ని సొంతం చేసుకున్నాడట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
previous post
మాది పెద్ద సినిమా కాదు.. గొప్ప సినిమా..