telugu navyamedia
సినిమా వార్తలు

మోడీకి రష్మీ “జబర్దస్త్” ప్రశ్న… ఇలాగైతే బేటీ బచావో, బేటీ పడావో ఎలా సాధ్యమవుతుంది ?

rashmi goutam movie sivaranjani trailer

“జబర్దస్త్” యాంకర్ రష్మీ గౌతమ్ ఒకవైపు షోలు చేస్తూనే, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కన్పిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్లలో రష్మీ ఒకరు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ గా ఉంటూ తన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా పలు సామజిక అంశాలపైనా రష్మీ స్పందిస్తూ ఉంటారు. ఇటీవల తెలంగాణలోని వరంగల్ లో 9 నెలల పసికందుపై ప్రవీణ్ అనే కీచకుడు అత్యాచారం చేసి హత్య చేసిన వార్త సంచలనం సృష్టించింది. ఆ రాక్షసుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా స్పందించారు. ఈరోజు ట్విట్టర్ లో రష్మి ఈ విషయమై ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించింది. ఆ పసికందుకు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేస్తూ “నరేంద్ర మోదీ సార్… మీరేమో బేటీ బచావో.. బేటీ పడావో (అమ్మాయిలను కాపాడండి.. అమ్మాయిలను చదివించండి) అంటున్నారు. కానీ అమ్మాయిలే మిగలకుంటే, బేటీ బచావో.. బేటీ పడావో ఎలా సాధ్యమవుతుంది?” అని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలపై సెలెబ్రిటీలు తమ గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ కామాంధుడు 9 నెలల పాపపై అత్యాచారం చేశాడని విని ఊరుకుంటే సరిపోతుందా ? ఈ అమానుష ఘటనపై రష్మీ ఇలా స్పందించడంపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వాలు త్వరగా మేల్కొని ఇలాంటి మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఈ కామ పిశాచుల బారిన మరికొంతమంది పసికందులు పడే ప్రమాదం ఉంది.

Related posts