telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడ్రస్ ఇచ్చిన హీరోయిన్… మరి అభిమానులు ఊరుకుంటారా ?

Manushi

మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నాక ఆమెకు సోషల్ మీడియాలో లెక్కకు మించిన అభిమానులు ఏర్పడ్డారు. దీంతో బాలీవుడ్ నుంచి మంచి అవకాశం ఆమె ఇంటి తలుపు తట్టింది. మానుషి ఇటీవలే ఒక బాలీవుడ్ సినిమాకు సైన్ చేశారు. ఈ సినిమాలో ఆమె అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్నారు. మొదటి సినిమా అవకాశమే అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సరసన కావడం విశేషమే. ఇలా మిస్ వరల్డ్ అయినప్పట్నుంచి వార్తల్లో ఉంటున్న మానుషీ మరోమారు చర్చల్లో నిలిచారు. ఇటీవల ఆమె తన చిరునామాను సోషల్ మీడియాలో వెల్లడించడంతో అభిమానులు పూల బొకేలు, గిప్టులతో ఆమె ఇంటిముందు క్యూ కడుతున్నారు. దీంతో అభిమానుల తాకిడిని తట్టుకోలేక ఆమె తన చిరునామాను తొలగించేపనిలో పడ్డారు.

Related posts