telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జాతీయ అవార్డు రాకపోతే ఏంటి ?… : నిత్యామీనన్

Nitya

“అలా మొదలైంది” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యామీనన్… ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికే నిత్యామీనన్ చాలా సినిమాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెను జాతీయ అవార్డు వరించకపోవడంపై తాజాగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. “ఓ నటిగా జాతీయ అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. అయితే నాకు జాతీయ అవార్డు రావాలంటే అందుకు తగ్గ సరైన కంటెంట్, క్యారెక్టర్ ఉన్న సినిమాలో నటించాలి. రొటీన్ స్టోరీలో నటించిన దానికి కూడా నేషనల్ అవార్డ్ వస్తే అది సంతృప్తినివ్వదు. నాకు ఫలానా సినిమాకు జాతీయ అవార్డు వచ్చిందంటే.. ఆ సినిమా నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి. అయినా అవార్డు రాకపోతే ఏంటి.. నా కెరీర్ ఇంకా ముగిసిపోలేదు. నా ముందు సుదీర్ఘమైన ప్రయాణం కనిపిస్తోంది. నన్ను నేను స్థిరపడిపోయిన హీరోయిన్‌ అని అనుకోవడం లేదు. నాలో ఇప్పటికీ సినిమా రంగంలో ఏదో సాధించాలన్న ఆశయం బలంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసింది చాలు అని ఎప్పుడూ అనుకోలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యామీనన్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియదర్శిణి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది. 2020లో నిత్యామీనన్ కు జయలలిత బయోపిక్ అవార్డును తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

Related posts