telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

15న భారత మార్కెట్ లోకి… ఆనర్ స్మార్ట్ ఫోన్.. అందుబాటు ధరలలోనే..

honor launching another smart phone in india

ఆనర్ నుండి మరో స్మార్ట్ ఫోన్ భారతదేశంలో విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. ఈ మొబైల్ ధరలు అందరికి అందుబాటు ధరలలో దేశీయంగా విక్రయించేందుకు సంస్థ ఏర్పాట్లు పూర్తిచేసింది. హువావే సబ్ బ్రాండ్ సంస్థ ఆనర్ నుండి నూతన స్మార్ట్ ఫోన్ ఈనెల 15న భారత మార్కెట్లో విడుదల కానుంది. ‘ఆనర్ 10 లైట్’ పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ గ్రేడియాన్ బ్లూ, వ్యాలే వైట్, మ్యాజిక్ నైట్ బ్లాక్ అనే మూడు రంగులలో లభ్యం కానుంది. గత సంవత్సరం చైనాలో 4 జీబీ/6 జీబీ అనే రెండు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరలు మనదేశంలో వరుసగా సుమారు రూ.14,400 (4 జీబీ), రూ.17,500 (6 జీబీ)గా ఉండే అవకాశం ఉంది. పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లో అధునాతన కిరిన్ 710 ప్రాసెసర్ ని అమర్చారు. ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రత్యేకంగా విక్రయించనుంది.

ఈ ఫోన్ ప్రత్యేకతలు :

* 6.21″ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (1080 x 2340 పిక్సల్స్)
* కిరిన్ 710 ప్రాసెసర్
* 4 జీబీ/ 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టం
* 13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 3400 ఎంఏహెచ్ బ్యాటరీ

Related posts