telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ఇద్దరూ డేటింగ్ కు రమ్మని పిలిచారు : రాధికా ఆప్టే

Radhika-Apte

రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. కాంట్రవర్శీ కామెంట్లకు కేరాఫ్‌గా నిలిచే ఈ అమ్మడు బాలకృష్ణతో ‘లెజండ్’, ‘లయన్’ సినిమాలలో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కబాలి సినిమాలలో నటించి దక్షిణదిలో క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్‌లో టాప్ హీరోలతో నటించిన ఈ భామ తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు.. హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. రాధికా ఆప్టే సినిమాల కంటే తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడంతోనే ఎక్కువ గుర్తింపును సొంతం చేసుకున్నారు. బోల్డ్ గా మాట్లాడమే కాదు ఏ విషయం గురించైనా ధైర్యంగా మాట్లాడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే ఓ ప్రోగ్రామ్ కు అతిథిగా వచ్చింది. షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. నేను వయస్సులో నాకంటే చిన్నవాడితో డేటింగ్ కు వెళ్లలేదు. నాకు బాగా గుర్తున్న విషయమేంటంటే..గతంలో నన్ను ఇద్దరబ్బాయిలు డేట్ కు రమ్మని అడిగారు. అయితే వారిలో ఒక వ్యక్తి నాకన్నా వయస్సులో చిన్నవాడు. ఇద్దరూ ఒకేసారి నన్ను డేట్ కు రమ్మని అడిగారు. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడొక ఆలోచన వచ్చింది. మా ఇంటికి ప్రతీరోజూ ఒక పిల్లి వస్తూండేది. దానికి ఓ చేపపిల్లను ఆహారంగా పెట్టాను. ఒకవేళ పిల్లి ఆ చేప పిల్లను తింటే ఒక అబ్బాయితో..తినకపోతే నాకంటే చిన్నవాడితో వెళ్లాలని ఫిక్స్ అయ్యా. అయితే చేప పిల్లను పిల్లి తిన్నది. వెంటనే ఒకబ్బాయితో డేటింగ్ కు వెళ్లా. నేను డేటింగ్ కు వెళ్లినవాడినే పెళ్లి చేసుకున్నా..అతడే నా భర్త బెనెడిక్ట్ టాయ్ లర్ అంటూ చెప్పుకొచ్చింది.

Related posts