telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి ఆరా

SPB

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. దీంతో ఆయన అభిమానులు, సన్నిహితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అంతా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. నిన్న రాత్రి ఆస్పత్రికి వచ్చిన కమల్ హాసన్.. బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని మీడియాకు చెప్పారు. రాత్రి 9 గంటల సమయంలో బాలు కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. నిపుణులైన వైద్యులతో మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాలు ఆరోగ్యాన్ని కుదటపరిచేందుకు 10 మంది ప్రత్యేక వైద్యులతో కూడిన బృందం ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ‘బాలు కోలుకోవాలి, క్షేమంగా తిరిగి రావాలి’ అంటూ పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు కోట్లాదిమంది అభిమానులు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. మీడియాలో బాలు ఆరోగ్యంపై నిరంతరాయంగా వార్తలు వస్తున్నాయి. గురువారం అర్థరాత్రి 12 గంటల తర్వాత మరో హెల్త్ బులిటెన్ ఇస్తామని ప్రకటించిన ఆసుపత్రి వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం మరింత ఆదోళన చెందిస్తోంది.

Related posts