telugu navyamedia
సినిమా వార్తలు

తాప్సీ శభాష్ మిథు ట్రైలర్ రిలీజ్..

హీరోయిన్​ తాప్సీ నటించిన చిత్రం ‘శభాష్‌ మిథు’. శ్రీజిత్‌ దర్శకత్వంలో మిథాలీరాజ్‌ నిజజీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. మిథాలీరాజ్ భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన విష‌యం తెలిసిందే

ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా శభాష్ మిథూ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. స్వయంగా మిథాలీ రాజ్.. తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ ట్రైలర్ ను అభిమానులతో పంచుకుంది.

‘ఒక ఆట.. ఒక దేశం.. ఒక ఆశయం.. నా కల! ఈ బృందానికి కృతజ్ఞతలు, నా కథను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది..’ అని ఇన్స్టాలో రాసుకొచ్చింది.

చిన్నతనం నుంచి క్రికెటర్‌ కావాలని మిథాలీ ఎంతగా ఆరాటపడింది.. క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంది.. మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం కోసం ఆమె ఎంతలా శ్రమించింది.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ సినిమాలో చూపించినట్లు పోస్ట‌ర్‌ చూస్తే అర్థమవుతోంది.

Thumbnail image

ఇక ట్రైల‌ర్ విష‌యానికొస్తే..”మెన్‌ ఇన్‌ బ్లూ మాదిరిగానే మనకి కూడా ఉమెన్‌ ఇన్‌ బ్లూ అనే ఓ టీమ్‌ ఉంటే బాగుంటుందని, ఎనిమిదేళ్ల వయసు నుంచి కలలు కంటున్నాను” అని తాప్సీ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ మనసుని హత్తుకునేలా ఉంది.

మిథాలీ ఆటను మొదలు పెట్టడం, ప్రాక్టీస్‌, కెప్టెన్‌గా మారడం, క్రికెట్‌లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, వారికి గుర్తింపు తీసుకువచ్చేందుకు పడిన కష్టాలు తదితర అంశాలను సినిమాలో చక్కగా చూపించనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ నటన అద్భుతంగా ఉంది.

 కొన్ని సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేసేలా ఉన్నాయి. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. జులై 15న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts