telugu navyamedia
రాజకీయ

ఇండియ‌న్ ఆర్మీ ‘అగ్నివీర్’ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

*ఆర్మీలో అగ్నివీర్ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల
* రేపు నేవీ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల
*ఈ నెల 24న‌ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్‌ నోటిఫికేష‌న్లు
*జూలై నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన‌సాగింపు

అగ్నిపథ్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిషికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై నుంచి ప్రారంభం కానుంది.

అంతేకాకుండా నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ తేదీల‌ను కూడా ప్ర‌క‌టించేసింది.మంగళవారం నేవీ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌.. ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Agnipath Recruitment Notification 2022 Indian Army Rally Eligibility Details

ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఇదిలా ఉండగా ఓ వైపు అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతుంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ఈ పథకం కింద నియామకాలపై దూకుడు పెంచింది.

భారత సైన్యంలో స్వల్పకాలిక నియామకాల కోసం అగ్నిపథ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్​ 14న ప్రకటించింది. 17న్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Related posts