నోబుల్ పురస్కార విజేత మలాలా జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ‘గుల్ మకై’ చిత్రం చిక్కుల్లో పడింది. దర్శకుడు అమ్జాద్ ఖాన్‌పై వేటు పడింది. త్వరలోనే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై ఫత్వా జారీ అయ్యింది. దర్శకుడు అమ్జాద్ ఖాన్‌కు వ్యతిరేకంగా నోయిడాకు చెందిన ఒక ముస్లిం మౌల్వీ… ఈ సినిమాలో ఖురాన్‌ను అవమానించారని ఆరోపిస్తూ ఫత్వా జారీ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఖాన్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఇప్పుడు ఈ సినిమా పోస్టర్‌పై వివాదం సృష్టిస్తున్నారని అన్నారు.
సినిమా పోస్టర్‌లో మలాలా ఒక బాంబు పేలుడు దగ్గర నిలుచుంటుందని, ఆ సమయంలో ఆమె చేతిలో ఒక పుస్తకం కనిపిస్తుందన్నారు. ఆ పుస్తకం ఖురాన్ అని నోయిడాకు చెందిన వ్యక్తి ఆరోపిస్తున్నారని అన్నారు. అది ఒక ఇంగ్లీషు పుస్తకమని అతనికి నచ్చజెప్పినా, వినడం లేదని అన్నారు.