telugu navyamedia
సినిమా వార్తలు

మోక్షజ్ఞతో బాలకృష్ణ ప్రత్యేక పూజలు… అందుకేనా ?

Balakrishna-and-Mokshagna

టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడనే ప్రశ్న నందమూరి అభిమానుల్లో తలెత్తుతోంది. అయితే గతంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై పలు రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. మోక్షజ్ఞకు సినిమాల మీద ఆసక్తి లేదని, ఇదే విషయాన్ని ఆయన బాలకృష్ణతో కూడా చెప్పారని వార్తలు వచ్చాయి. కానీ మరోసారి త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది సినీవర్గాల్లో. ఇప్పుడు మళ్ళీ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సంబంధించిన వార్తలు తెరపైకి ఎందుకొచ్చాయంటే… తూర్పుగోదావరి జిల్లాలో బాలకృష్ణ, మోక్షజ్ఞ కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నాడు. కుమారుడు మోక్షజ్ఞతో కలిసి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్ర గ్రామానికి వచ్చిన బాలకృష్ణ… శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగమల్లేశ్వర అధ్వర్యంలో స్వామి వారికి చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకంలో బాలకృష్ణ, మోక్షజ్ఞలు పాల్గొన్నారు. అయితే ఈ పర్యటన మొత్తం గోప్యంగా సాగింది. బాలకృష్ణ వస్తున్నారనే విషయం ముందుగానే తెలియడంతో పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మీడియా సహా ఎవరికి ఆలయ పరిసరాల్లోకి అనుమతించలేదు. పూజల అనంతరం బాలకృష్ణ, మోక్షజ్ఞలు వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయారు. దీంతో త్వరలోనే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్న బాలకృష్ణ… ఈ క్రమంలోనే కుమారుడితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts