telugu navyamedia
రాజకీయ

అగ్నిపథ్ ప‌థకం : జంతర్ మంతర్ దగ్గర రెండో రోజు కాంగ్రెస్​ సత్యాగ్రహ దీక్ష..

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన సత్యాగ్రహ దీక్ష రెండోరోజు కొన‌సాగుతుంది. సోమవారం కూడా జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది.

 అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు.

కాగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. జంతర్ మంతర్‌ వద్దకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేతల బృందం సోమవారం సాయంత్రం రాష్ట్రపతిని కలవనున్నారు.

సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కన్నయ్య కుమార్, మల్లిఖర్జున ఖర్గే, జేడీ శీలం, రణదీప్ సూర్జేవాల, కాంగ్రెస్ ఎంపీలు, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్టాల పీసీసీ ప్రెసిడెంట్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు.. అగ్నిప‌థ్ వ్య‌తిరేకంగా భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో దిల్లీలో భారీగా ట్రాఫిక్​ స్తంభించిపోయింంది. ఎక్కడిక్కడే వేల కొలది వాహనాలు నిలిచిపోయాయి.

Related posts