telugu navyamedia
సినిమా వార్తలు

సీనియర్ హీరోయిన్ తో అర్జున్ కపూర్ ప్రేమాయణం… క్లారిటీ వచ్చేసింది…

Arjun-Kapoor

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, నటి మలైకా అరోరాలు పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొన్నిరోజుల క్రితం మీడియాలో విన్పించాయి. ఈ విషయంపై వీరిద్దరూ పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా మలైకా అరోరా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అర్జున్ కపూర్‌తో తన సంబంధాన్ని ధృవీకరించారు. నిన్న అర్జున్ కపూర్ 34వ పుట్టినరోజు సందర్భంగా మలైకా వీరిద్దరికీ సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ “పుట్టినరోజు శుభాకాంక్షలు మై క్రేజీ, ఫన్నీ మరియు అద్భుతమైన అర్జున్ కపూర్. నీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం ఉండాలి” అంటూ పోస్ట్ చేసింది. అర్జున్ కపూర్ తన పుట్టినరోజును న్యూయార్క్ లో మలైకాతో కలిసి జరుపుకున్నాడు. మలైకా వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోను పోస్ట్‌ చేస్తూ “ఇప్పుడు మా బంధాన్ని బహిరంగంగా ఉంచాలనుకుంటున్నాం. మా మధ్య బంధాన్ని అందరూ గౌరవించాలనుకుంటున్నాము” అని తెలిపినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. మలైకా అరోరా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్జున్ మరియు మలైకా గతకొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. కానీ ఇటీవలే వారు ఈ విషయాన్నీ మీడియాకు అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

గతంలో అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా ఆ తరువాత విడాకులు తీసుకుంది. ఇంతకుముందు ఇంటర్వ్యూలో మళ్లీ ప్రేమ దొరకడం తన అదృష్టమని, ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని, సంతోషంగా ఉండటానికి తనకిది రెండవ అవకాశం అని అన్నారు. ఇక అర్జున్ కపూర్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే రాజ్ కుమార్ గుప్తా రూపొందించిన “ఇండియా మోస్ట్ వాంటెడ్‌” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం “పానిపట్”తో అర్జున్ కపూర్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్, కృతి సనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పానిపట్” చిత్రం డిసెంబర్ 6న థియేటర్లలోకి రానుంది.

Related posts