ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ కుమార్ సింగ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉందని, తాను గెలవడం కష్టమేనని వాపోయారు. ఆయన బరిలో ఉన్న మొరాదాబాద్‌లో 47 శాతం మంది ముస్లిం ఓటర్లు, జాతవ్‌లు 9 శాతం ఉండడమే ఆయన ఆవేదనకు కారణం.
2014 ఎన్నికల్లో కున్వర్ విజయం సాధించారు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు వేర్వేరు అభ్యర్థులను నిలబెట్టడంతో ఓట్లు చీలిపోయి స్వల్ప మెజారిటీతో కున్వర్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో కున్వర్ చేతిలో ఓడిన హసన్ మళ్లీ ప్రత్యర్థిగా మారారు. ఈసారి ఓట్లు చీలే అవకాశం లేకపోవడంతో తన ఓటమి ఖాయంగా కనిపిస్తోందని కున్వర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.