telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కర్ణాటక జైళ్ల శాఖకు శశికళ లేఖ

shashikala tamilnadu

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ ముందస్తుగా విడుదల కాబోతున్నాని ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆమె స్పందిస్తూ తనకు సంబంధించిన విషయాలను ఎవరికి పడితే వారికి ఇవ్వడంపై మండిపడ్డారు. ఈ మేరకు కర్ణాటక జైళ్లశాఖ అధికారులకు లేఖ రాశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా బయటకు వస్తున్నాయి. తన వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని అందులో ఆమె కోరారు. తన విడుదల సమాచారాన్ని సేకరించిన వారితో తనకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

తన విడుదలకు అడ్డుతగిలేలా కొత్త వివరాల కోసం సమాచార చట్టాన్ని అడ్డం పెట్టుకునే అవకాశం ఉందని లేఖలో ఆమె పేర్కొన్నట్టు శశికళ శిబిరం పేర్కొంది. రూ. 10 కోట్ల జరిమానా చెల్లించి వచ్చే ఏడాది జనవరిలో శశికళ విడుదలయ్యే అవకాశం ఉందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. 

Related posts