telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

అమెరికా అల్లుళ్ల.. తాటతీసే మహిళా చట్టం.. తస్మాత్ జాగర్త!

marriage wishes gone viral and case filed

అమెరికా అల్లుడు అనగానే చాలా మందికి ఆసక్తి.. ఈ ఆసక్తి ఆ అమ్మాయి వరకట్నవేధింపులకు గురై, ఏడ్చే వరకు ఉంటుంది. ఆ తరువాత తెలిసిందే.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. అయినా చాలామంది తల్లిదండ్రులు విదేశీ సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా కొంతమంది మోసగాళ్లు బరి తెగిస్తున్నారు. విదేశాల్లో ఉన్న తమపై ఎలాంటి చర్యలూ తీసుకోలేరనే నమ్మకంతో పెళ్లయ్యాక భార్యలను అదనపు కట్నం కోసం వేధించడం.. పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోవడం.. లేదంటే రెండో పెళ్లి చేసుకోవడం, అంతకు ముందే పెళ్లయినా దాచిపెట్టి మరోమారు పెళ్లిచేసుకోవడం వంటివి ఇందులో కొన్ని. ఇలాంటివి జరిగితే అమ్మాయి తల్లిదండ్రులు ఆవేదన చెందడం తప్ప విదేశాల్లో ఉన్న అల్లుడిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు.

చట్టపరమైన సమస్యల కారణంగా పోలీసులు ఇలాంటి కేసుల్లో ఏమీ చేయలేకపోతున్నారు. ఇలాంటి కేసులకు సరైన పరిష్కారం కనుక్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖలోని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయబోతోంది. లక్డీకపూల్‌లోని మహిళా భద్రతా విభాగం భవనంలో ఈ సెల్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్‌ఆర్‌ఐ కేసులపై ఇప్పటికే అమెరికా కాన్సులేట్‌లో సంప్రదింపులు జరిపారు. కనుక అమెరికా అల్లుళ్ళు కాస్త బుద్దిగా ప్రవర్తించండి.. లేదంటే.. పగిలిపోద్ది..!!

Related posts